అర్జున్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్

యాక్షన్ కింగ్ అర్జున్ చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే విశ్వక్ సేన్ కి కథ వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయి. విశ్వక్ జంటగా అర్జున్ కూతురు ఐశ్వర్య నటించనుంది.

అర్జున్ స్నేహితుడు జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. విశ్వక్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం ఓకే అనిపించుకుంది. ద‌మ్కీ సెట్స్‌పై ఉంది. ఇవి కాక ఇంకో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. మరో వారం పది రోజుల్లో అర్జున్ సినిమా పూర్తి వివరాలు తెలియనున్నాయి.