బాలయ్యకు నో చెప్పిన ఐటమ్

బాలయ్య కు ఎప్పుడూ హీరోయిన్ల సమస్య వస్తుంటుంది. కానీ ఈసారి ఐటమ్ గర్ల్ సమస్య వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం అదిరిపోయే ఐటమ్ ట్యూన్ ఒకటి రెడీ చేశాడు బాలయ్య. అంతేకాదు.. ఐటమ్ భామని స్వయంగా బాలయ్య సూచించారు. గద్దల కొండ గణేష్, క్రాక్, ఖిలాడీ సినిమాల్లో డింపుల్ ను చూసిన తరువాత ఆమెతో ఐటమ్ సాంగ్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చాడట.

బాలయ్య మెచ్చిన ఐటమ్ ను తీసుకొచ్చేందుకు దర్శకుడు ట్రై చేశాడు. కానీ ఆమె నో చెప్పేసింది. తాను ఐటమ్ సాంగ్ లు చేయనని, మంచి పాత్ర అయితేనే చేస్తానని డింపుల్ ఖరాఖండీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు గోపీచంద్ అప్ సెట్ అయినట్టు తెలిసింది. మరో హాట్ బ్యూట్ కోసం ప్రయత్నాలు షురూ చేసినట్టు సమాచారం.  డింపుల్ చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలు వున్నాయి. ఇలాంటి టైమ్ లో ఐటమ్ సాంగ్స్ చేస్తే.. సినిమా అవకాశాలు వెనక్కి వెళతాయని భయపడుతోంది.