ఎఫ్ 3 హైలైట్స్ : ఆ ఆరు ఏపీసోడ్స్.. అరుపులేనట
ఎలాంటి కథని ఎంచుకొన్నా, పూర్తి వినోదాత్మకంగా చెప్పడం అనిల్ రావిపూడి స్టైల్. అప్పటో జంథ్యాల ఆ తరవాత ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇప్పుడు అనిల్ రావిపూడి అన్నమాట. తనలో ఎంత ఫన్ ఉందో.. ఎఫ్ 2లో చూపించేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఎఫ్ 3 వంతు వచ్చింది. వచ్చే శుక్రవారం (మే 27) వస్తోంది.
ఇక ఈ సినిమాలో ఆరు ఏపీసోడ్లు అరుపులు, కేకలు పెట్టించడం ఖాయమని లీకుల ద్వారా తెలిసిన విషయం. అందులో రాంబోగా.. అలీ ఎపిసోడ్ అయితే హైలెట్ గా నిలవబోతోందట. జూనియర్ ఆర్టిస్టుగా వెన్నెల కిషోర్ ప్రహసనంతో పాటు.. కథలో వెంకటేష్ రేచీకటిని, వరుణ్‌తేజ్ నత్తిని వాడుకొన్న విధానం కూడా బాగా ప్లస్ అయ్యిందని, తమన్నా పాత్ర ఎఫ్ 2లో కంటే ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయ్యిందని తెలుస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో తీశారట. ఆ ఎపిసోడ్ చూసి, థియేటర్ల నుంచి నవ్వుకొంటూ బయటకు వస్తారని.. చిత్రబృందం ధీమాగా చెబుతోంది.