ఆ రెండు ఓటీటీలను బ్యాన్ చేయాలి
భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయంటే సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. అందుకు తెలుగు రాష్ట్రాలు స్పెషల్ పర్మిషన్ ఇస్తున్నాయి. థియేటర్స్ లో మాత్రమే కాదు.. ఇప్పుడు ఓటీటీలోనూ పెద్ద సినిమాల వస్తున్నాయంటే అదనపు బాదుడు షురూ చేశాయి. లాక్ డౌన్ అనంతరం థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన కేజిఎఫ్ 2, ఆర్.ఆర్ ఆర్ సినిమాలు ఓటి టి లోకి వచ్చేశాయి. అయితే ఓ టి టి లో ప్రదర్శించే విషయంలో ఈ రెండు సినిమాలు తీసుకున్న వైఖరి పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేజీఎఫ్ 2 అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. అయితే అమెజాన్ ఖాతాదారులంతా చూసేయడానికి వీల్లేదు. అదనంగా మరో రూ. 199 చెల్లించాలి. ఆర్ ఆర్ ఆర్ కూడా ఇదే కండీషన్ తో ఈ నెల 20వ నుంచి నుండి జి 5 లో అందుబాటులోకి రానుంది. ఆర్ ఆర్ ఆర్ చూడాలంటే అదనంగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ అదనపు రుసుం చెల్లించిన 24 గంటల్లో సినిమాలో చూసేయాలి. సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమాలకు డబ్బులు చెల్లించి చూడాలనే సంప్రదాయం ఓటీటిలు తీసుకురావడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీల తీరు ఇలాగే ఉంటే.. ఖాతాదారుల సంఖ్య భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటీకే జీ5, అమెజాన్ ప్రైమ్ లను బ్యాన్ చేయాలనే డిమాండ్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది.