ఎఫ్ 3 నో నెగిటివ్ టాక్
నవ్వుల సినిమా ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎఫ్ 3 థియేటర్స్ లో నవ్వులు నాన్ స్టాప్. పడి పడి నవ్వడం గ్యారంటీ అంటూ చిత్రబృందం అంచనాలు పెంచేస్తోంది. ప్రచార చిత్రాలు చూస్తే అది నిజం అనిపిస్తోంది. మొత్తానికి రిలీజ్ ముందే ఎఫ్ 3కి అన్నీ పాజిటివ్ శకునాలే. పోటీలో పెద్ద సినిమాలేవీ లేవు. ఆచార్య పని అప్పుడే అయిపోయింది. కేజీఎఫ్ 2 క్రేజ్ కూడా క్రమంగా తగ్గుతోంది.
మరోవైపు టికెట్ ధరల పెంపు లేదు. రెగ్యూలర్ రేట్లకే ఎఫ్ 3 అందుబాటులోకి రానుంది. పైగా వెంకీ ఉన్నాడు. ఆయన సినిమా అంటే ఫ్యామిలీ ప్రేక్షకులకి పండగే. అనిల్ రావిపూడి కామెడీ అంటే అందరికీ ఇష్టమే. గ్లామర్ కోరుకునే వారికి తమన్నా, సోనాల్ చౌహాన్ కనిపిస్తున్నారు. తానేమీ తక్కువ కాదంటూ.. ప్రమోషన్స్ లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది మెహ్రీన్. ఇన్నీ ఉన్నా.. దిల్ రాజు కు నెగటివ్ టాక్ భయం పట్టుకుంది. అందుకే నెగటివ్ టాక్ వినబడకుండా ఆయన పక్కగా ప్లాన్ చేశారు.
ఎఫ్ 3 లాంటి పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఫ్యాన్స్ షోలూ పడతాయి. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో పెద్ద సినిమాలకు బెన్ఫిట్ షోల జాతర మామూలే. అయితే… ఈ షోల వల్ల ఓ ఇబ్బంది ఉంది. సినిమా బాగుంటే ఫర్వాలేదు. నెగిటీవ్ టాక్ వస్తే మాత్రం.. చాలా ఎఫెక్ట్ పడుతుంది. నెగిటీవ్ టాక్ బాగా స్పైడ్ అయిపోతే, వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
అందుకే.. ఇలాంటి షోలకు ఎఫ్ 3ని దూరంగా ఉంచారు. భారత కాలమానం ప్రకారం అమెరికాలోనూ అర్థరాత్రి షోలు మొదలవుతాయి. తెల్లారేసరికి… టాక్ బయటకు వచ్చేస్తుంది. ఆ టాక్ నెగిటీవ్‌గా ఉన్నా ప్రమాదమే. సో… అమెరికాలో సైతం.. తెల్లవారుఝామున షోలు లేవట. దాదాపుగా ఇండియాలోనూ, ఓవర్సీస్లోనూ ఒకేసారి షోలు మొదలయ్యేలా టైమింగ్ సెట్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి.. రిలీజ్ ముందు ఎఫ్ 3 కి నో నెగిటివ్ టాక్ అన్నమాట.