హర్షల్‌ పటేల్‌ అందుకే సక్సెస్ అవుతున్నాడు

ఈసారి ఎలాగైనా ఐపీఎల్ కప్ కొట్టాలనే కసితో కనిపిస్తున్న బెంగళూరు జట్టు అందుకు రెండు అడుగుల దూరంలో ఉంది. నేడు జరగనున్న క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్ జట్టుతో ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో గెలిచి.. ఫైనల్ లో గుజరాత్ జట్టుతో అమీతుమీ తేల్చుకోవాలని చూస్తోంది. అయితే  చివరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే హర్షల్ పటేల్‌ మరోసారి రాణించాల్సి ఉంది. 

క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ గెలుపులో హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన అతడు.. మార్కస్‌ స్టాయినిస్‌ (9)వంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేశాడు. హర్షల్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఒక్క సిక్సర్‌ మాత్రమే కొట్టించుకున్నాడు. అతడి చేతి వేళ్లకు గాయాలున్నా బౌలింగ్‌ చేస్తున్నాడు. తన బౌలింగ్‌తో వైవిధ్యం చూపించాడు. ఈ క్రమంలోనే కొన్ని బంతుల్ని మెల్లగా, మరికొన్ని బంతుల్ని బౌన్సీగా వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను గందరగోళానికి గురిచేస్తున్నాడు. అదే హర్షల్ పటేల్ సక్సెస్ కు కారణమని మాజీ మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్‌ అభిప్రాయపడ్డారు.