బాలయ్య కోసం నవ్వుల పోరి

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా  (#NBK107) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలయ్యకు జంటగా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా కోసం ముందుగా నరసింహారెడ్డి, అన్నగారు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్య ‘అన్నగారు’కే ఓటేశారు. ఆ టైటిల్ దాదాపు ఫిక్సయింది అన్నారు. అయితే అనూహ్యంగా ‘జై బాలయ్య’ టైటిల్ జై కొట్టినట్టు తెలిసింది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారు దర్శకుడు. పక్కా మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తయారవుతోంది.

ఇక #NBK108 అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా మెహ్రీన్ కనిపించబోతుంది. ఎఫ్ 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న అనిల్ రావిపూడి బాలయ్య సినిమా వివరాలు పంచుకున్నారు. ‘నాది ప‌క్కా ఎంట‌ర్‌టైన‌ర్ జోన‌ర్‌. అయితే… బాల‌య్య‌తో సినిమా ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ సినిమా. నా త‌ర‌హా కామెడీ ఉంటుంది కానీ.. అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే ఉంటుంది. బాల‌య్య ఓ వ‌ప‌ర్ ఫ్యాక్టరీ. దానికి త‌గిన క‌థే సిద్ధం చేశా. న‌న్ను… నాతో పాటుగా బాల‌య్య‌ని కూడా ఈ సినిమాలో కొత్త‌గా చూస్తారు. మాస్ ఎలివేష‌న్లు, యాక్ష‌న్ సీన్లు.. అన్నీ ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.