మోడీ వర్సెస్ కేసీఆర్.. ఎవరిది పై చేయి ?

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్ పర్యటనకు వస్తే.. ఆయనకు దగ్గరుండి స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరుకు పోయిండు. అంతేకాదు.. మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా గురువారం రాజకీయాలు సాగినయి. కుటుంబ పాలన, అవినీతి వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని.. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని ప్రధాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు.

మరోవైపు మీరు రాష్ట్రంలో గిచ్చితే.. నేను కేంద్రంలో మిమ్మల్ని కొరుకుతా అన్నట్టు.. బెంగళూరు టూర్ లో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని బాంబు పేల్చారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని.. దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఇలా గురువారం రాజకీయం మోడీ వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సాగాయి. వీరిలో ఎవరిది పైచేయి అంటే.. ఎవరికి వారే తమదే అని చెప్పుకుంటున్నారు.