DK.. గ్రేట్ : అక్తర్

ఐపీఎల్-2022 లో బెంగళూరు ఫినిషర్‌గా డీకే (దినేష్ కార్తీక్) అద్భుత బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన 15 మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేశాడు. సగటు 64.80 ఉండగా స్ట్రైక్‌రేట్‌ 187.28గా నమోదైంది. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇలాగే చెలరేగితే బెంగళూరు ఈసారి తొలి ట్రోఫీ అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. మరోవైపు డీకేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

డీక్ బలంగా తిరిగిరావడం గొప్పగా ఉందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసించాడు. కార్తీక్‌ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అయినా, బలంగా తిరిగొచ్చాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో నేను స్వతహాగా చదివి తెలుసుకున్నా. దీంతో అతడు తిరిగొచ్చిన విధానం నన్నెంతగానో ఆకట్టుకుంది. అతడు చాలా గొప్ప పని చేశాడని చెప్పొచ్చు. పరిపక్వత అంటే ఇదే. నేను ఆడే రోజుల నుంచి అతడు ఆడుతున్నాడు. మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడు. మంచి వారికి అంతా మంచే జరుగుతుంది. అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడం చాలా గొప్పగా ఉంది. నా తరఫున అభినందనలు అన్నారు అక్తర్.