దివాళా దిశగా తెలంగాణ

దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం. ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని కేసీఆర్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. మరోవైపు ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారని మండిపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తెలంగాణ, మరో శ్రీలంక అవుతుందని హెచ్చరించారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం దివాళా దిశగా సాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్‌లో జరిగిన భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ నుంచి 80శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు.