NBK107 ఫస్ట్ లుక్

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని బాలయ్య 107వ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కత్తి పట్టుకొని తెగ నరుకుతూ బాలయ్య పవర్ ఫుల్ గా కనిపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం ముందుగా నరసింహారెడ్డి, అన్నగారు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. బాలయ్య ‘అన్నగారు’కే ఓటేశారు. ఆ టైటిల్ దాదాపు ఫిక్సయింది అన్నారు. అయితే అనూహ్యంగా ‘జై బాలయ్య’ టైటిల్ జై కొట్టినట్టు తెలిసింది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారు దర్శకుడు. పక్కా మాస్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తయారవుతోంది. డింపుల్ హయతి ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.