ఐపీఎల్ ఫైనల్.. మ్యాచ్ ఫిక్సింగ్..! అందుకే గుజరాత్ గెలుపు ?

 అద్భుతాలు ఏమి జరగలేదు. పాయింట్ల పట్టికలో మొదటి నుంచి టాప్ లో కొనసాగుతూ వస్తున్న గుజరాత్ టైటాన్స్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్ కదా.. ఇండియా-పాక్ మ్యాచ్ ల నరాలు తెగే ఉత్కంఠ ఏమీ లేదు. కనీసం లీగ్ దశలో జరిగిన రసవత్తర పోరు ఫైనల్ మ్యాచ్ లో కనిపించలేదు. ముందే గుజరాత్ విజయం ఖరారైనట్టు.. రాజస్థాన్ జట్టు పేలవంగా ఆడింది.. ఓడింది. మరోవైపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. #fixing యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గరుండి మరీ.. తమ సొంత రాష్ట్రం గుజరాత్ ను గెలిపించారని ఆరోపిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకొంది. ఇక్కడే క్రీడాభిమానులకు డౌటు అనుమానం వచ్చింది. టాస్ గెలిచి మొదటి ఫీల్డింగ్ చేసిన జట్టుదే విజయం అన్నట్టుగా తాజా సీజన్ సాగింది. రెండో క్వాలిఫైయర్ లో బెంగళూరు పై గెలవడానికి కారణం టాస్ గెలవడమేనని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ పేర్కొన్నారు. అలాంటి సంజూ టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నడు. అనుమానాలకు తావునిచ్చాడు.

ఫిక్సింగ్ వెనుక పొలిటికల్ మైలేజ్ ?

త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాని షురూ చేసిండు ప్రధాని నరేంద్ర మోడీ. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ గెలుపుని రాజకీయ వర్గాలు సవాల్ గా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఫైనల్ మ్యాచ్ కు అమిత్ షా హాజరవ్వడం.. మ్యాచ్ కు ముందు ఆయన కొడుకు, బీసీసీఐ కార్యదర్శి జై షా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో ముచ్చటించడం.. ఇవన్నీ ఫిక్సింగ్ లో భాగమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అవి నిజమే అన్నట్టు.. రెండో క్వాలిఫైయర్ లో బెంగళూరుపై పులుల్లా గర్జించిన సంజూ సేన.. ఫైనల్ లో పిల్లిలా మారిపోయింది. ఆఖరి రెండు ఓవర్లే ఉన్నా.. యువ బ్యాట్స్ మెన్ పరాగ్ బ్యాట్ ఝులిపించలే. సింగిల్ తీస్తే చాలు.. లేదంటే ఛేజింగ్ లో గుజరాత్ కు కష్టమైతది అన్నట్టుగా అతడి ఆట సాగింది. ఇవన్నీ చూసిన నెటిజన్లు ఐపీఎల్ ఫిక్సింగ్ అయిందని అంటున్నారు. దీనిపై రాజస్థాన్, గుజరాత్ జట్టు, లేదంటే బీసీసీఐ ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాలి.

ఇక ఫైనల్ మ్యాచ్ లో..  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బ్యాటర్లలో జోస్‌ బట్లర్ (39) ఒక్కడే రాణించాడు. యశస్వీ జైస్వా్ల్‌ (22) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (14), దేవదత్‌ పడిక్కల్ (2), హెట్‌మెయర్‌ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్‌ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లు,  సాయికిశోర్‌ రెండు, రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుభమన్‌ గిల్‌ (45; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్‌ (32) రాణించగా.. సాహా (5), వేడ్ (8) విఫలమయ్యారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్‌ కృష్ణ, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

Game Changer Of The Match !🤣😂#ipl #iplfinal #gujarattitans #IPL2022Final #IPL2022 #fixing #GT #Congratulation #GTvsRR #fixing pic.twitter.com/nIwCc7FZUE— Asjad shanu (@AsjadShanu) May 29, 2022

Next election in Gujarat#fixing pic.twitter.com/xErcdMftz0— IDFC (@Rutwik_here) May 29, 2022

#fixing
Post fixing scenes pic.twitter.com/atznnAVrKk— Vishnu K B (@Vishnukb8055) May 29, 2022

If you know you know! 😎🔥#IPL2022 #GujaratTitans #GTvRR #IPLFinal #fixing pic.twitter.com/3Cqxt7ENuj— Sarthak Bhawankar 🇮🇳 (@sarthakvb_108) May 29, 2022