నితిన్ సినిమాకు కమల్ ప్రచారం

కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. క్యాథరిన్ రెండో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో కలెక్టర్ ఎన్.సిద్దార్థ్ రెడ్డి గా నితిన్ కనిపించబోతున్నాడు.

ఆగస్టు 12న మాచర్ల నియోజవర్గం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అప్పుడే సినిమా ప్రమోషన్స్ కు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. తొలి సాంగ్ ‘చిల్ మారో’ రేపు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నారు.

కమల్ తాజా చిత్రం విక్రమ్. జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేస్తున్న కమల్ చేతుల మీదుగా తన సినిమా తొలి సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు నితిన్. ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.