రాజ్యసభ అభ్యర్థులను ఖరారు.. బీజేపీ నుంచి 16, కాంగ్రెస్ నుంచి 10 మంది !
బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలు తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ఖరారు ప్రకటించింది. ఏడు రాష్ట్రాల నుంచి 10 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హరియాణా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్, కర్ణాటక నుంచి జైరామ్ రమేశ్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారికి అవకాశం కల్పించింది.
అంతకుముందు భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది. 8 రాష్ట్రాల నుంచి 16 మందికి రాజ్యసభ సీట్లు ఖరారు చేసింది. సుశ్రి కవితా పటిదార్‌కు మధ్యప్రదేశ్ నుంచి, జగ్గేష్‌కు కర్ణాటక నుంచి, అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండేకు మహారాష్ట్ర నుంచి, ఘన్‌శ్యా్‌మ్ తివారీకి రాజస్థాన్ నుంచి, లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శన సింగ్, సంగీతా యాదవ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి, కల్పనా సైనాకు ఉత్తరాఖండ్ నుంచి, సతీష్ చంద్ర దూబేకు బిహార్ నుంచి, కిషన్ లాల్ పన్వార్‌కు హరియాణా నుంచి అవకాశం కల్పించారు.