మంత్రిని తరిమి తరిమి కొట్టిన జనాలు
తెలంగాణ మంత్రుల్లో కొందరిపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. మంత్రి మల్లారెడ్డిని.. ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన సోదరులు తరిమి తరిమి కొట్టడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రెడ్ల సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డికి ఘోర అవమానం జరిగింది.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా నిర్వహించిన ఈ సభలో రెడ్ల ఐకాస నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ఈక్రమంలో కొందరు సభికులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రూ.5వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పదే పదే అడ్డుకోవడంతో మంత్రి ప్రసంగాన్ని నిలిపివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కొందరు ఆయన వాహన శ్రేణిపై కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరారు. మంత్రి కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ కుర్చీలు విసరడంతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆఖరికి పోలీసుల ప్రొటెక్షన్ తో మంత్రి అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది.
#Telangana minister #MallaReddy @chmallareddyMLA not allowed to give his full speech, raised slogans, during #ReddySimhaGarjana meeting at #Ghatkesar near #Hyderabad. All political party leaders were present in the meeting. pic.twitter.com/C3Epqo26fA— Surya Reddy (@jsuryareddy) May 29, 2022
Angry participants at Reddy Mahah Sabha in #Ghatkesar threw chairs, stones and footwear on #Telangana Minister #MallaReddy
When Minister was praising the #TRS govt he also faced sloganeering. He then abruptly ended his speech and left from the venue pic.twitter.com/mmh0pQnO5y— Aneri Shah (@tweet_aneri) May 29, 2022