విరాటపర్వం మరింత ముందుకు

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాటపర్వం’ విడుదల తేదీ మారింది. గతేడాదే విడుదలకావాల్సిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 1న రిలీజ్‌ చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇటీవల చెప్పింది. ఇప్పుడు అనూహ్యంగా రిలీజ్ డేట్ జూన్ 17కి ప్రీ ఫోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది.

మరోవైపు దర్శకుడు వేణు ఉడుగుల ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు. ఓ మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 1990ల్లో తెలంగాణలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా, నక్సల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో రానా హీరోనే అయినప్పటికీ, సినిమా మొత్తం సాయిపల్లవి పాత్ర చుట్టూ తిరుగుతుంది.

We’ll see you sooner 🙈 #VirataParvam from the “17th of June” ♥️@RanaDaggubati @venuudugulafilm @SLVCinemasOffl pic.twitter.com/7byqVrw1hq— Sai Pallavi (@Sai_Pallavi92) May 30, 2022