హిట్ రచయిత, ప్లాప్ దర్శకుడికి బాలయ్య ఛాన్స్

బివిఎస్ ర‌వి ర‌చ‌యిత‌గా విజయాలు అందుకున్నారు. అయితే దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయారు. వాంటెడ్‌, జ‌వాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయ‌న మ‌రోసారి మెగా ఫోన్ ప‌ట్టే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. అయితే ఇప్పుడు బాల‌కృష్ణ ఆ అవ‌కాశం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బాల‌య్య కోసం బివిఎస్ ర‌వి ఓ క‌థ సిద్ధం చేశార‌ని, అది బాల‌య్య‌కూ న‌చ్చింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ లో సినిమాపై ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.

బాల‌య్య ర‌వికి అవ‌కాశం ఇవ్వ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం.. అన్ స్టాప‌బుల్‌. ఆహాలో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ టాక్ షోకు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ షో తెర వెనుక సూత్ర‌ధారి బివిఎస్ ర‌వి. షోని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిన ర‌వి ప‌నితీరు బాల‌య్య‌కు న‌చ్చింద‌ని, అందుకే ఈ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓసినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఆ త‌ర‌వాత‌.. అనిల్ రావిపూడి సినిమా ఉంది. బోయ‌పాటి శ్రీ‌ను కూడా లైన్‌లో ఉన్నాడు. ఇవ‌న్నీ పూర్త‌య్యాకే ర‌వితో ప్రాజెక్టు ఉంటుంది.