వైజాగ్ లో రణ్ బీర్, రాజమౌళి.. ఘన స్వాగతం !

బ్రహ్మాస్త్ర టీమ్ వైజాగ్ కు విచ్చేసింది. వారిని దర్శకధీరుడు రాజమౌళి దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా రణ్ బీర్ కపూర్, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, రాజమౌళికి ఘనస్వాగతం  లభించింది. కారుపై ఊరేగిస్తూ.. గజమాలతో సత్కరించారు. రణ్ బీర్ తో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.  దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు ప్రజల ఆతిథ్యానికి రణ్ బీర్ ఫిదా అయినట్టు కనిపించింది.

‘బ్రహ్మాస్త్ర – ఫాంటసీ అడ్వెంచర్. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, మౌనిరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ప్రీతమ్ సంగీతం. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ’. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రణ్ బీర్ అండ్ కో వైజాగ్ కు విచ్చేశారు. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ హీరోగా యానిమల్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రణ్ బీర్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు.