సక్సెస్ పార్టీలో ప్రియుడితో రకుల్

కార్తీక్ ఆర్యన్-కియారా జంటగా నటించిన ‘భూల్‌ భులయ్యా 2’. మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చి.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజల తర్వాత బాలీవుడ్‌లో కాస్త మంచి కలెక్షన్లు రాబడుతున్న మూవీగా నిలిచింది. ఈ హ్యాపీ మూడ్ లో సోమవారం రాత్రి చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. కార్తీక్ ఆర్యన్, కియారా, టబులతో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఈ పార్టీకి రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నాని తో కలిసి అటెండ్ అయింది. ప్రియుడితో కలిసి సరదాగా గడిపింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో బిజీ బిజీ. అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఏడెనిమిది సినిమాలు పడ్డాయి. వీటిలో రెండు సినిమాలు ఎటాక్, రన్ వే 34 ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మరో అరడజను సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయాలన్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి, 31 అక్టోబర్ లేడీస్ నైట్.. ఇలా క్యూ ఉంది. చేతిలో ఉన్న సినిమాలన్నింటిని పూర్తి చేసిన రకుల్  కొత్త సినిమాల ఛాన్స్ కోసం తనదైన శైలిలో ట్రై చేస్తోంది.