ఎన్టీఆర్‌ సినిమాపై సోనాలి స్పందన

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందులో ఎన్టీఆర్‌ సరికొత్తగా కనిపించనున్నారు. ప్రస్తుతం పాత్రకు సంబంధించినట్లు మేకోవర్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే ను చిత్ర బృందం సంప్రదించిందని వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ ప్రచారంపై సోనాలి స్పందించారు. “ఈ విషయం నిజంగా నాకు తెలియదు. అవన్నీ అసత్య వార్తలు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటివరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు” అని చెప్పుకొచ్చారు. సోనాలి హిందీలో ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. జీ5లో త్వరలోనే ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఆమె నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది.