#SSMB28 సరికొత్త పోస్టర్లు

మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ (#SSMB28) సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కావాల్సివుంది. కానీ కాలేదు. జూన్ లో ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈరోజు సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా #SSMB28 కొత్త పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవి అఫీషియల్ గా చిత్ర యూనిట్ వదిలినవి కావు. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అన్నమాట. అయితే అవి అద్భుతంగా డిజైన్ చేసి ఉండటంతో.. సూపర్ ఫ్యాన్స్ వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక #SSMB28 లో మహేష్ కి జంటగా పూజ హెగ్డే నటించనున్నారు. అతడు సినిమాకు సీక్వెల్ గా ఉండనుందనే ప్రచారం ఉంది. అతడులో మహేష్ పేరు పార్థు. అదే టైటిల్ తో #SSMB28 తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘అర్జునుడు’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ కు అ సెంటిమెంట్ ఉంది కాబట్టి.. అర్జునుడు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నారు.
