కమల్ కు హ్యాండిచ్చారు

విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. ఇద్దరూ మంచి నటులు. ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరూ ప్రమోషన్లకు రారు. ఉప్పెనలో భారీ పారితోషికం అందుకొని మరీ నటించాడు విజయ్‌సేతుపతి. కానీ ఆ సినిమా ప్రమోషన్లలో కనిపించలేదు. పుష్పలో.. ఫహద్ కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్లలో ఫహద్ లేడు.

ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘విక్రమ్’లో నటించారు. కమల్ హాసన్ నటిస్తూ, నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్లలోనూ ఫహద్, విజయ్ సేతుపతి లేనే లేరు. విక్రమ్
ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఫహద్, విజయ్ సేతుపతి రానే లేదు. కమల్ అంటే.. ఇద్దరికీ గౌరవమే. కానీ సినిమా విషయానికొస్తే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఉంది.. ఈ ఇద్దరు హీరోల తీరు.
