మరో హీరోయిన్ పెళ్లి ఫిక్స్
టాలీవుడ్ నటి పూర్ణ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని తను స్వయంగా ప్రకటించింది. దుబాయ్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షనిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు తమ ఎంగేజ్ మెంట్ పూర్తయిందనే విషయాన్ని పూర్ణ స్వయంగా వెల్లడించింది.
పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిమ్. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది పూర్ణ. హీరోయిన్ గా చాలా సినిమాలు చేసినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గలేదు. రీసెంట్ గా అఖండ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. మరోవైపు బుల్లితెరపై కూడా జడ్జిగా, డాన్స్ పెర్ఫార్మర్ గా బిజీ అయింది. ఇలా 2 చేతులా సంపాదిస్తోంది పూర్ణ.