హాలీవుడ్ స్టార్ వార్ : జానీ డెప్ కు బాలీవుడ్ సపోర్ట్

హాలీవుడ్ స్టార్ వార్ పై తుది తీర్పు వచ్చేసింది. మాజీ దంపతులు జానీ డెప్ – అంబర్ హెర్డ్‌ల పరువు నష్టం కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు ఆరు వారాలకు పైగా నిరంతరాయంగా సాగిన ఈ కేసు విచారణలో అంబర్ హెర్డ్ ఆరోపణలు తప్పని జ్యూరీ గుర్తించింది. దీంతో నటుడు జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
జానీ పరువుకు భంగం కలిగించినందుకుగానూ హెర్డ్ ఆయనకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు జానీ డెప్ వైపే బాలీవుడ్ నిలబడింది. హీరోయిన్లు దిశా పటానీ, శృతి హాసన్ తదితరులు జానీ డెప్ ను సపోర్ట్ చేస్తూ.. ట్విట్ చేశారు.