జగన్ రెడ్ కార్పెట్, కేసీఆర్ కు రెడ్ లైట్

రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. ఏపీ సీఎం జగన్ కు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేస్తుంది. ఆయన అడిగినన్ని అప్పులు ఇస్తుంది. అడగకున్నా అపాయింట్ మెంట్ ఇస్తోంది. గురువారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానితో అరంగట సేపు భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అయితే ఈ సారి మోడీ-జగన్ భేటీ అంశాలు సీక్రెట్. ఒక్కటి బయటికి రాలేదు. ప్రెస్ నోట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో జగన్ అడిగిన కోరికలన్నీ కేంద్రం తీరుస్తున్నట్టు కనబడుతుంది. అంతేకాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన జగన్ తన స్నేహితుడిగా బీజేపీ భావిస్తుంది.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ను శత్రువుల కేటగిరిలో పెట్టారు. ఈ నేపథ్యంలో ‘మిషన్ తెలంగాణ’ చేపట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల స్వల్ప వ్యవధిలో హైదరాబాద్ పర్యటనకు వచ్చి వెళ్లిన మోడీ, షా లు.. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే దూకుడు పెంచారు. తాజాగా బీజేపీ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించాలని నిర్ణయించారు. జులై 2,3 తేదీల్లో ఈ సవేశాలు జరగనున్నాయి. మోడీ, షా తో పాటు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. సమావేశాలు జరగనున్న రెండు రోజులు మోడీ, షా, ఇతర ముఖ్యనేతలు హైదరాబాద్ లో బస చేయనున్నారు.