మోడీ పైసలు పడ్తలేవా.. గిట్ల చేయిర్రి !
PM కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడి సాయంగా రూ.6000 ఇస్తున్నది. వీటిని మూడు విడతలుగా రూ.2000 చొప్పున అర్హులైన రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. 11వ విడత డబ్బులను మే 31 న ప్రధాని మోదీ సిమ్లాలో వర్చువల్ ఈవెంట్ ద్వారా విడుదల చేశారు.
అయితే.. కొందరి అకౌంట్లో రూ. 2000 జమ కాగా ఇంకా చాలా మందికి డబ్బులు అకౌంట్లో పడలేదు. ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా మొదలగు డిటెయిల్స్‌ను తప్పుగా సమర్పించడం వంటి కారణాల వలన PM కిసాన్ డబ్బులు అకౌంట్ లో పడే అవకాశం ఉండదు. అందుకనే PM కిసాన్ కోసం వివరాలను సమర్పించేటప్పుడు జాగ్రత్త వహించాలి.
ఒకవేళ 11వ విడత డబ్బులు మీకు రాకపోతే వెంటనే కింద ఇచ్చిన పద్ధతులను అనుసరించి సమస్యలను అధికారులకు తెలియజేయవచ్చు.
PM కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266
PM కిసాన్ హెల్ప్‌లైన్ నెంబర్ :155261, 011-24300606, 0120-6025109
PM కిసాన్ ల్యాండ్‌లైన్ నెంబర్లు : 011-23381092, 23382401
pmkisan-ict@gov.inలో సంప్రదించి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా ఆధార్, బ్యాంకు వివరాలను సరిదిద్దుకొవచ్చు.