రాజమౌళి డైరెక్షన్ లో పవన్ సినిమా.. కథ రెడీ !

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆ కోరిక లేకపోయినా.. ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. పవన్-జక్కన్న కాంబోలో సినిమా పడితే చూడాలని కోరుకుంటున్నారు. వారి కోరిక తీరేలా ఉంది. రచయిత విజయేంద్ర ప్రసాద్ కి పవన్ కళ్యాణ్ కంటే ప్రత్యేకమైన అభిమానం. బాహుబలి ఇంటర్వెల్ సీన్ కి పవన్ కళ్యాణే స్ఫూర్తి చాలా సందర్భాల్లో చెప్పారాయన. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడాయన ఓ కథ రెడీ చేశారు.
ఆ కథని ఇతర హీరోలకు ఇవ్వొచ్చు. కానీ ఆ కథకు రాజమౌళి అయితేనే న్యాయం చేయగలడని అంటున్నారు. రాజమౌళికి కూడా పవన్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో ఆయనకీ వుంది. ఐతే అది కుదరలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథతో సిద్ధంగా వున్నారు. ఐతే రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమాతో సినిమా చేయాలి. అది పూర్తయినప్పటికీ కనీసం రెండేళ్ళయినా పడుతుంది. పవన్ కూడా ఇప్పుడు బల్క్ లో కాల్షీట్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తే.. ఆయన ఫ్రీ కావొచ్చు. అప్పుడు జక్కన్న పవన్ సినిమా ఉంటే ఉండొచ్చేమో. !