ఆపరేషన్ RCB-2023.. షురూ !

ఐపీఎల్ కప్ ఆర్సీబీ అందని ద్రాక్షే అయింది. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన రెండడుగుల దూరంలో నిలిచిపోయింది.. ఆ జట్టు. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. అయితే వచ్చే ఐపీఎల్ లో ఎలాగైనా కప్ కొట్టాలని భావిస్తున్న ఆ జట్టు  ఇప్పటి నుంచే అందుకు ప్రణాఌకలు సిద్ధం చేసుకుంటోంది.

ఇందులో భాగంగా బలహీనలను గుర్తించే పనిలో ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం పేపర్ పై బలంగా ఉంది. కానీ బౌలింగ్ లో వీక్ గా కనిపిస్తుంది. స్పిన్నర్ హసరంగా వికెట్లు తీయడంతో ఆ లోటు పెద్దగా కనబడలేదు కానీ.. జట్టుకు జరగాల్సిన నష్టం మాత్రం జరిగింది. అయితే వచ్చే సీజన్‌కు ఆ జట్టు ఈ బలహీనతను అధిగమించే ప్రయత్నం చేస్తుంది. కేవలం మినీ వేలం జరిగే అవకాశం ఉంది కాబట్టి జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ ఓ నలుగురి ఆటగాళ్లకు మాత్రం గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. 

మహమ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే, షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్, అనూజ్ రావత్ లను వదులుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మాక్స్ వెల్ ను వదిలేస్తే బెటర్ అని మాజీలు, ఆర్సీబీ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే ? తన దేశం తరుపున అద్భుతంగా ఆడే మాక్స్ వెల్.. ఐపీఎల్ మాత్రం ప్రతిసారీ నిరాశపరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వస్తున్నాయి.