రాజకీయం కోసం కాదు.. చదువు కోసం !
తన క్రికెట్ కెరీర్ మొదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గంగూలీ చేసిన ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. “2022.. నా క్రికెట్ కెరీర్లో 30వ సంవత్సరం. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. అన్నిటికంటే మించి మీ మద్దతు పొందగలిగాను. నేనీ స్థాయిలో ఉండటానికి తోడ్పాటు అందించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి వ్యక్తికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఈ సందర్భంగా చాలామందికి ఉపయోగపడే ఒక పనికి శ్రీకారం చుడుతున్నా. నా జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్న వేళ ఇదే మద్దతు ఇక ముందూ కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని గంగూలీ రాసుకొచ్చారు. అయితే దాదా కొత్త అధ్యాయం పొలిటికల్ ఎంట్రీనే అంటూ జోరుగా ప్రచారం జరిగింది.
తాజాగా ఈ ప్రచారంపై గంగూలీ స్పందించారు. ఈ వార్తలపై ఆశ్చర్యపోతూ వివరణ ఇచ్చాడు. తాను చదువుకు సంబంధించి ఒక అంతర్జాతీయ యాప్‌ను తీసుకురానుండడం గురించే ట్వీట్ చేసినట్లు తెలిపారు. అదేదో.. ముందుగానే క్లారిటీ ఇవ్వొచ్చుగా అని ఆయన అభిమానులు అంటున్నారు. అనవసరంగా గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లో దాదా వర్సెస్ దీదీ పోరు రసవత్తరంగా ఉండనుంది అని ఊహించుకున్నామని అంటున్నారు.