ప్రభాస్-యష్-ప్రశాంత్ నీల్.. సూపర్ కాంబో !

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ చేస్తున్నారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రభాస్ సినిమా ఉండనుంది.

ఇక శనివారం పుట్టినరోజును జరుపుకుంటున్న ప్రశాంత్ నీల్ కు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక బర్త్ డే కానుకగా సలార్ నుంచి అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే సలార్ సెట్స్ నుంచి ఓ పిక్ మాత్రమే షేర్ చేశారు. ఇందులో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుతో హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు బయటికొచ్చాయి.

ప్రభాస్-యష్-ప్రశాంత్ నీల్ కాంబోఅదిరిపోయిందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. కేజీఎఫ్ 2 కు వందరెట్లు సలార్ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. కేజీఎఫ్ కు పని చేసిన టెక్నికల్ టీమ్ సలార్ కోసం పని చేస్తున్నారు.