సుహానా.. సూపర్ హాట్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్, బిగ్ బీ అమితాబ్ మనవడు అగస్త్య నందా ఒకే సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. #TheArchies టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ న్యూ మ్యూజికల్ డ్రామాను నెట్ ఫ్లిక్స్ కోసం తీసుకొస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. అక్కడ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సుహానా ఖాన్ తనలోని హాట్నెస్ ని బయటికి తీసింది. హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ హాట్ అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. బాలీవుడ్ కి దొరికిన సూపర్ హాట్ బ్యూటీ సుహానా అంటూ క్రిటిక్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. నిండైన అందాలతో… జీరో సైజ్ నడుము అందాలతో సుహానా సూపర్ హాట్ ఉంది.