బెర్లిన్ నగరంలో జాన్వీ షికారు

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల జాతర కొనసాగుతుంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా హాట్ హాట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంది.. ఈ ముద్దుగుమ్మ. వరుణ్ ధావన్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం #Bawaal షూటింగ్ ప్రస్తుతం బెర్లిన్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో బెర్లిన్ వీధుల్లో విహరిస్తుంది జాన్వీ.

తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. ఎప్పటిలాగే హాట్ హాట్ గా కనిపించింది ముద్దుగుమ్మ. స్లిట్ ఫిట్ పూల డ్రెస్ లో జాన్వీ స్పెషల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్.. బవాల్ సినిమాతో పాటు.. గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాల్లో నటిస్తోంది.

