కమల్ నేర్పిన గుణపాఠం
యాభై ఏళ్ళుదాటిన హీరోలు సినిమా అంతా తామై నడపాలని భావిస్తున్నారు. యంగ్ హీరోయిన్స్, ఐటెం సాంగ్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఐతే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోయిజం రూల్స్ ని బ్రేక్ రూల్ చేస్తూ విక్రమ్ సినిమాతో కొత్తదారి చూపి విజయాన్ని అందుకున్నారు.
విక్రమ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు విక్రమ్ పాత్ర దాదాపు కనిపించదు. హాఫ్ పేజీ డైలాగులు కూడా వినిపించవు. ఫస్ట్ హాఫ్ అంతా ఫహద్, విజయసేతు పాత్రలు హైలెట్ గా కనిపిస్తాయి. సినిమాలో పాత్రలన్నీ హైలెట్ చేస్తూ చివరికి విక్రమ్ పాత్ర జోడించాడు. ఇది ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కమల్ కనిపించనప్పటికీ ఇది కమల్ సినిమా కాదనే భావన ఎవరిలోనూ వుండదు. పైగా ఆ పాత్రపై ఇంకా ఆసక్తిపెరుగుతుంది. ఇక సెకండాఫ్ లో కమల్ నట విశ్వరూపం చూపించారు. చాన్నాళ్ల తర్వాత కమర్షియల్ హిట్ కొట్టారు.