కరోనా విజృంభణ.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈ నెల 22కి హైకోర్టు వాయిదా వేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,149 నమూనాలను పరీక్షించగా 119 పాజిటివ్‌లు నిర్ధరణ అయ్యాయి. సోమవారం ఈ సంఖ్య 65 మాత్రమే. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 658కు చేరుకుంది. గత వారం రోజులతో పోల్చితే హైదరాబాద్‌లో కేసులు గణనీయంగా పెరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా చూసుకుంటే.. ఈరోజు 5వేలకుపైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.