పవన్ సినిమాలో సల్మాన్ ఖాన్

గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పవన్-హరీష్ శంకర్ కాంబోలో రెండో సినిమాగా “భవధీయుడు భగత్ సింగ్” తెరకెక్కనుంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమా గురించి సూపర్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారట.

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌లో స‌ల్మాన్ కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ల్మాన్‌పై ఓ ఫైట్, పాట‌ తెర‌కెక్కించారు. ఇంకొంత షూటింగ్ మిగిలి ఉంది. ఈ సినిమా సెట్ లోనే సల్మాన్ తో హరీష్ శంకర్ భేటీ కావడం జరిగింది. దీంతో సల్మాన్ తో హరీష్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే పవన్ సినిమా కోసమే సల్మాన్ ను అడిగారట. ఆయన ఓకే కూడా అనేశారట. దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ గా తీసుకొచ్చారు హరీష్. అయితే తెలుగు రిమేక్ కోసం చేసిన మార్పులు చాలా బాగున్నాయని గతంలో సల్మాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అంత్యాక్షరి ఏపీసోడ్ దబాంగ్ లో లేదు. అయితే గబ్బర్ సింగ్ లో అదే హైలైట్ గా అయిన విషయం తెలిసిందే.