నయన్ పెళ్లిలో షారుఖ్ సందడి

ఐదేళ్ల ప్రేమ నేడు ఏడడుగులు వేస్తోంది. నయనతార – విఘ్నేష్ శివన్ పెళ్లి బంధంతో ఒక్కటి అవుతున్నారు. మహాబలేశ్వరం లో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ విచ్చేశారు. జవాన్ దర్శకుడు అట్లీతో కలిసి నయన్ పెళ్లికి హాజరయ్యారు షారుఖ్.

మరోవైపు కొద్దిసేపటి క్రితమే సూపర్ స్టార్ రజినీకాంత్ వివాహ వేడుక వద్దకు చేరుకున్నారు. మరికొందరు ప్రముఖులు నయన్ పెళ్లికి వస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరుకానున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా నయన్, విఘ్నేష్ లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చాలా అరుదైన ఫోటోలు షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు. అయితే పెళ్లితంతుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్తపడినట్టు తెలుస్తున్నది.

