ఈ నెలలోనే ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావం
కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఏకంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో టీఆర్ఎస్ మాదిరిగా బీఆర్ఎస్ .. అంటే భారత రాష్ట్ర సమితి ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారని ప్రకటించారు. వారి కోరిక మేరకు భారత రాష్ట్ర సమితిని ఢిల్లీ వేదికగా ప్రకటించాలని నిర్ణయించారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు స్పష్టత నిచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ నెలాఖరులో ఢిల్లీలో పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం.ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే భారత రాష్ట్ర సమితి ఏర్పాటుకు బ్యాక్ గ్రౌండ్ ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ రెండో తేదీన దేశంలోని అన్ని దినపత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇక జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే సంచలనం సృష్టించేందుకు రాష్ట్రపతి ఎన్నికలను వాడుకునే అవకాశం ఉంది.