BRS లో TRS విలీనం ?

రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఉండదా ? జెండా – అజెండా మారిపోనుందా ? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తు చేస్తున్నారు.  ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) పేరుతో ఈ నెలఖరులో పార్టీ ప్రారంభం ఉండనుంది అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ ఉంటుందా ? బీఆర్ఎస్ లో విలీనం అవుతుందా ?? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఒకే పార్టీకి రెండు పేర్లు, రెండు జెండాలు, రెండు అజెండాలు ఉండటం మంచిది కాదు. అందుకే టీఆర్ ఎస్ పార్టీని బీఆర్ ఎస్ లో విలీనం చేసే అవకాశాలే ఎక్కువని తెలుస్తుంది. అలా అయితే.. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఫ్లేవర్ ను పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. టీఆర్ఎస్ మొదట ఉద్యమ పార్టీ.. ఆ తర్వాతే పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించింది. ఇప్పుడు.. ఆ పార్టీ విలీనం కావొచ్చని అంటున్నారు.