సుందరానికి కటింగ్
‘అంటే సుందరానికీ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూడు గంటల సినిమాను ట్రిమ్ చేస్తే బాగుంటుందని చాలా మంది సలహా ఇస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా 3 గంటలు చూడడం చాలా కష్టం. విడుదలకు ముందు కూడా చిత్రబృందంలో నిడివి గురించిన డిస్కర్షన్ బాగా నచ్చింది. సినిమా నిడివి పెరిగిందని, కాస్తో కూస్తో కత్తిరించాలని కొందరు, అలా కత్తిరిస్తే ఎమోషన్ మిస్సయిపోతుందని కొందరు వాదించుకొన్నారు. చివరికి కత్తెర వేయకూడదనే నిర్ణయం తీసుకొన్నారు.
ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుడు సినిమా బాగుంది. కానీ లెన్త్ ఎక్కువైంది. మూడు గంటల సినిమా చూసే ఓపిక లేదంటున్నాడు. దీంతో కనీసం 20 నిమిషాల రన్ టైమ్ తగ్గిస్తే బాగుంటుందని ఇప్పుడు ఆలోచనలో పడినట్టు టాక్. ఎక్కడెక్కడ కత్తెర్లు వేయాలి? అనే విషయంపై దర్శక నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. బహుశా.. రెండో వారానికి ట్రిమ్ చేసిన సుందరం అందుబాటులోకి రావొచ్చు.