భారీ కాన్వాయ్.. పవన్ కు సీఎం కళ వచ్చేసిందోచ్ !

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని ఆయన భక్తులు, అభిమానులు చెప్పుకుంటున్నారు. దానికి అవకాశాలు కూడా లేకపోలేవు. ఇన్నాళ్లు మేం తగ్గాం. ఇకపై తగ్గేదేలే అంటున్నాడు పవన్. పొత్తుల విషయంలో తమకు మూడ్నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. సీఎం పీఠం దక్కే ఆప్షన్ ను ఎంచుకుంటామని నేరుగానే చెప్పేస్తున్నారు జనసేన శ్రేణులు. అంతేకాదు.. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారి ఓట్లు చీలనీయబోమని చెప్పిన పవన్..తేదేపాతో కలిసేందుకు డోరు తెరిచే ఉంచారు. మొత్తానికి.. ఏపీ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కు సీఎం కళ వచ్చేసింది. సిఎమ్ ల కాన్వాయ్ ల తరహా పవన్ ఒకే కలర్ కారులను ఓ ఎనిమిది కొనేశారు. కొత్త కార్లు ఎనిమిది అంటే సుమారు కోటిన్నర వరకు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నల్లటి కాన్వాయ్ చూస్తుంటే పవన్ కు సిఎమ్ కళ వచ్చేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పార్టీ నాయకులు ఓ కార్ లోనే వెళ్తారు. వారి అనుచరులు వివిధ వాహనాల్లో అనుసరిస్తారు. అవి పది కార్లు కావచ్చు. పాతిక కావచ్చు. లేదా ప్రత్యేకమైన కేరవాన్ ను చేయించుకుంటారు. అలాగే యాత్ర పొడవునా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ పవన్ దీనికి భిన్నంగా ఓ సిఎమ్ మాదిరిగా కాన్వాయ్ రెడీ చేసుకున్నారు. ఎనిమిది నల్ల స్కార్పియో వాహనాలు పార్టీ ఆఫీసుకు వచ్చి చేరాయి. ఆరు నెలల టూర్ కు అంతా రెడీ అయిపోయింది.