రూ.2 వేల నోటులో జీపీఎస్‌ ఉంటుందా?

 బిగ్ బీ అమితాబ్ హోస్ట్ గా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కొత్త సీజన్ త్వరలో షురూ కాబోతుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆసక్తి రేపుతోంది. టైప్‌రైటర్‌, టెలివిజన్‌, శాటిలైట్‌, రూ.2 వేల నోటు.. ఈ నాలుగింటిలో జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) సాంకేతికత దేనిలో ఇమిడ్చి ఉంటుంది? అని ఓ మహిళా పోటీదారును అమితాబ్‌ ప్రశ్నించడంతో వీడియో మొదలవుతుంది. ఆమె రూ.2 వేల నోటని టక్కున చెప్పగా.. అది తప్పని అమితాబ్‌ అంటారు.

‘జోక్‌ చేస్తున్నారా?’ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ‘నిజమని నువు నమ్మింది.. ఒక జోక్‌’ అంటూ అమితాబ్‌ వివరిస్తారు. ‘నేనీ సమాచారాన్ని వార్తా ఛానళ్లల్లో చూశా’ అని ఆమె గట్టిగా చెబుతారు. ‘అది వారి తప్పిదం, సరైన సమాధానం శాటిలైట్‌’ అంటూ ఆయన ముక్తాయిస్తారు. ‘సమాచారం ఎక్కడి నుంచైనా సేకరించు.. మొదట దానిని నిర్ధారించుకో’ అన్న అమితాబ్‌ సూచనతో వీడియో ముగుస్తుంది. ఇప్పుడీ.. ఈ ప్రోమో వైరల్ గా మారింది.   

The new KBC promo. Sudhir and Shweta could really learn from it. Nano chip in Rs. 2000 note. 😭🙏 #KBC2022 #KBC pic.twitter.com/EiIRS4uNim— CodeZ🌻 (@CodeZ) June 12, 2022