కీర్తి సురేష్.. కెవ్వు కేక !

హీరోయిన్ కీర్తి సురేష్ చీరకట్టులో అందంగా కనిపిస్తుంది. అయితే ట్రెండీ లుక్ లో అంతకంటే అందంగా ఉంటుందని ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో దిగిన కీర్తి సురేష్ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ లో అతిలోక సుందరి శ్రీదేవి ని మైమరిపిస్తుంది.. ఈ ముద్దుగుమ్మ.

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి. ఆ తర్వాత నేను లోకల్, మహానటి, రంగ్ దే తదితర సినిమాల్లో నటించింది. ఈ ఏడాది సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేసింది. కళావతి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బిజీ బిజీ. అయితే ఏ మాత్రం ఖాళీ దొరికినా ఇలా తన టేస్ట్ కు తగ్గట్టుగా అందాలు ఆరబోస్తూ ఉంటుంది.