పక్కా రొటీన్
మారుతి దర్శకత్వంలో గోపీచంద్-రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫక్తు మారుతి మార్క్ సినిమా. ఫన్, పంచ్ లు బాగానే పేలాయి. గోపీచంద్ స్టయిలీష్ గా కనిపించాడు. రాశీఖన్నా మరోసారి బెల్లం శ్రీదేవిని గుర్తు చేసింది. అయితే పక్కా రొటీన్ కథ-కథనాలతో పక్కా కమర్షియల్ తెరకెక్కినట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.
పక్కా కమర్షియల్ అయిన లాయర్ గా గోపీచంద్…ఆ వైఖరి నచ్చిని అతని తండ్రిగా సత్యరాజ్ ఢీకొనడం అన్నది స్టోరీ లైన్ గా కనిపిస్తోంది. ఇందులో లీడ్ క్రిమినల్ గా రావు రమేష్. ట్రయిలర్ ను డిటైల్డ్ గా కట్ చేసారు. ఆ విధంగా స్టోరీ మీద ఓ అంచనా వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. హీరో కమర్షియాలిటీ, అతన్ని ఇష్టపడుతూనే, మార్చాలనే ప్రయత్నం చేసే హీరోయిన్, కొడుకు మీదే లీగల్ ఫైట్ కు దిగిన తండ్రి ఇదీ కథ అన్నట్లు ట్రయిలర్ కట్ చేసారు. ఫన్ బాగుంది. కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కమర్షియల్ హిట్ దక్కవచ్చు.