పీకే లేటెస్ట్ సర్వే రిపోర్ట్ .. షాకింగ్ నిజాలు !
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ సారి టీఆర్ఎస్ పనితనం మీద సీఎం కేసీఆర్ కు పీకే సర్వే రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది. ఇందులో కారు స్పీడ్ కేవలం 23 మాత్రమే అనే ప్రచారం జరిగింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ? మరోసారి పీకే ప్రగతి వెళ్లారు. తాజా సర్వే రిపోర్ట్ ను కేసీఆర్ చేతిలో పెట్టారు. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు, మరికొన్ని సానుకూలతలు కనిపించాయని సమాచారం.
ముఖ్యంగా సిట్టింగులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు టికెట్లు ఇవ్వొద్దని.. ఇప్పటి నుంచే కొత్త వారిని రెడీ చేసుకోమని పీకే కేసీఆర్ కు సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. మంత్రులు, ముఖ్య నేతల అవినీతి గబ్బు పార్టీని డ్యామేజ్ చేస్తుందని తేలింది. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో.. కొత్త హామీలను ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మే అవకాశాలు కనిపించడం లేదని పీకే చెప్పినట్టు టాక్. అదే సమయంలో కేసీఆర్ పాలనపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. కానీ స్థానిక నాయకత్వంపైనే నెగటివ్ ఉందని పీకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రావడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా పీకే వివరించారని సమాచారం.