సాయి పల్లవి పొట్టి దుస్తులు వెనుక పెద్ద కథ
హీరోయిన్ సాయి పల్లవి పెద్దగా గ్లామర్ షో చేయదు. పొట్టి దుస్తులు, క్లీవేజ్ షోలు ఆమె నుంచి ఎక్స్ పెక్ట్ చేయకూడదు. సినిమా అంగీకరించే ముందే ఈ కండీషన్స్ గురించి క్లారిటీ చెప్పేస్తుంది. అయితే పొట్టి దుస్తులు వేసుకోకపోవడం వెనుక పెద్ద కథ ఉందని తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలిపింది.
“వైద్య విద్య నేర్చుకోవడానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. టాంగో డ్యాన్స్ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే కాస్ట్యూమ్స్ మాత్రమే ధరించాలి. అదే విషయాన్ని అమ్మ వాళ్లకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, దుస్తుల విషయంలో నేనూ సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే ‘ప్రేమమ్’లో నటించే అవకాశం వచ్చింది. అందరి నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో నేను జార్జియాలో చేసిన టాంగో డ్యాన్స్ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు దాన్ని చూసి, కామెంట్స్ చేసిన విధానం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులకు నో చెప్పడం మొదలుపెట్టాను” అని సాయిపల్లవి తెలిపారు.
ఇక వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు రానా.. రవన్న అనే విప్లవ నాయకుడిగా నటించారు. జూన్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.