ప్రేమలో సాయి పల్లవి.. అతడి కోసం ప్రేమగా !

హీరోయిన్ సాయి పల్లవి ప్రేమలో ఉందా ? అంటే అవుననే అంటోంది.  “నేను వెజిటేరియన్‌. నాకస్సలు నాన్‌ వెజ్‌ గురించి తెలియదు. కానీ ఒక వ్యక్తి కోసం ఓసారి షాప్‌కు వెళ్లి.. చికెన్‌ తీసుకువచ్చి వండి పెట్టాను. ఆరోజు నాకెంతో ఆనందంగా అనిపించింది. నాలో ఇంత ప్రేమ ఉందా అని నవ్వుకున్నా” అని చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? అనేది ఆమె చెప్పలేదు. దీంతో ఆ లక్కీ ఫెల్లో ఎవరు ? అని ఆరా తీసే పనిలో అభిమానులు ఉన్నారు.

ఇక రానా – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ ఇంటెన్స్‌ ప్రేమకథను రూపొందించారు. జూన్‌ 17న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి ప్రేమ గురించి స్పందించారు. అంతేకాదు.. లాక్ డౌన్ టైమ్ లో ఆమెకు పెళ్లి సంబంధాలు కూడా చూశారట.

‘పెళ్లి చేసుకోమని లాక్ డౌన్ టైమ్ లో అమ్మానాన్న నాపై చాలా ఒత్తిడి చేశారు. వాళ్లు లాక్ డౌన్ తో భయపడ్డారు. ఎవరు ఎప్పుడు ఉంటామో తెలియదు, ఇప్పుడే పెళ్లి చేసేయాలని అనుకున్నారు. ఓ సంబంధం కూడా చూశారు. కానీ నేనింకా పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పాను. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ గా తయారై, మరో వ్యక్తికి సపోర్ట్ గా నిలబడగలనో అప్పుడు పెళ్లి చేసుకుంటా’నని చెప్పానని ఫిదా హీరోయిన్ చెప్పుకొచ్చారు.