శ్రద్ధాకపూర్ సోదరుడు అరెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వీకెండ్‌లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో సిద్ధాంత్ కూడా ఉన్నారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు సినిమాల్లో సిద్ధాంత్ నటించారు. ‘భౌకాల్’, ‘షూట్ ఔట్ వాడాలా’, ‘అగ్లీ’ వంటి చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు.