పెళ్లి మూడ్ లో కళావతి

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి మూడ్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కేరళలో సందడి చేస్తోంది. బంధువుల పెళ్లికి హాజరైంది. ఈ వేడుకలో మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి కూడా జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా కేరళ అందాలను ఆస్వాదిస్తున్నారు. బంధువులు, స్నేహితులతో కలిసి సరదా గడుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేశారు. 

తాజాగా చీరకట్టులో కిర్రాక్ పోజులతో ఆకట్టుకుంది కళావతి. ఈ ముద్దుగుమ్మ పెళ్లి వేడుకకు వెళ్లినట్టుంది. ఆమెనే పెళ్లికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. చీరలో పర్ ఫెక్ట్ ఫిట్ అందాలతో కేకపెట్టిస్తోంది.

‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయం అయింది కీర్తి. ‘నేను లోకల్’తో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ‘మహానటి’తో ఆమె కీర్తి మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస ప్లాపులు పలుకరించడంతో గాడి తప్పినట్టు అనిపించింది. కానీ ‘సర్కారు వారి’ పాటతో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం కీర్తి  వాషి (మలయాళం) ,మామన్నన్ (తమిళ్), దసరా, భోళా శంకర్ (తెలుగు)  సినిమాల్లో నటిస్తోంది.