నయన్ రొమాన్స్ కు దూరం

పాత పద్దతులకు పాతరేసి.. సరికొత్త కండిషన్లు పెడుతుందట నయనతార. ఆమె మీడియా ముందుకు రాదు. సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనదు. షూటింగ్ కు వచ్చామా ? వెళ్లామా ? అన్నట్టు ఉంటుంది. దాదాపు 15 ఏళ్లుగా ఇదే తంతు. దీనికి కారణం ఆమె డేటింగ్ వ్యవహారాలే. గతంలో ప్రభుదేవాతో డేటింగ్ చేసింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దాదాపు పెళ్లిపీటల వరకు వచ్చిన ఆ పెళ్లి ఆగిపోయింది. అంతకంటే ముందే శింబుతో నయన్ ప్రేమ వ్యవహారం నడించింది. ఈ డేటింగులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయని ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది నయన్. అయితే ఇప్పుడు ఆమె లైఫ్ లో సెటిలైపోయింది. ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది. సో.. ఇప్పుడిక ఆమె మీడియా ముందుకు రావొచ్చు అంటున్నారు. మరోవైపు తన కండీషన్ల లిస్టులో కొత్త అంశాన్ని చేర్చిందట. ఇకపై రొమాంటిక్ సీన్లలో నటించనని చెబుతుందట.

కండిషన్ల మీద కండిషన్లు పెట్టి దర్శక-నిర్మాతలకు చుక్కలు చూపెట్టే నయన్ కు ఆమె అత్త సరికొత్త షరతులు విధించినట్టు సమాచారం. గతంలో నయన్ ప్రభుదేవాతో డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే సమయంలో విడిపోయారు. ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని స్వయంగా నయన్ నే తెలిపింది. శ్రీరామరాజ్యం తన ఆఖరి సినిమా అని సన్నిహితుల దగ్గర చెప్పింది కూడా. ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం కాబోతుందట. ఈ కండిషన్ ను వాళ్ల అత్త పెట్టినట్టు తెలుస్తోంది.