రాహుల్ కు 80 ప్రశ్నలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజుల పాటు విచారించిన ఈడీ వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈరోజు కూడా ఆయన ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
ఇక గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాహుల్‌పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతోన్న విషయం తెలిసిందే. బుధవారం కూడా కాంగ్రెస్ ఆందోళన కొనసాగుతోంది. అయితే సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటనల దృష్ట్యా ఈడీ కార్యాలయం సహా రాహుల్ నివాసం, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ చుట్టూ 144 సెక్షన్ విధించారు.